శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి కళ్యాణ షష్ఠి తీర్థం మహోత్సవములు-కడలి - శ్రీ కపోతేశ్వర స్వామి ఆలయం .Sri Kapoteswara Swamy Temple ,KADALI VILLAGE .(AP)

 



శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి కళ్యాణ షష్ఠి తీర్థం మహోత్సవములు - శ్రీ కపోతేశ్వర స్వామి ఆలయం కడలి, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా, రాజోలు మండలానికి చెందిన గ్రామం. రాజోలు నుండి లేదా జగ్గన్నపేట నుండి కేవలం మూడు కిలో మీటర్ల దూరం కలిగిన ఈ గ్రామం గోదావరి తీరప్రాంత గ్రామాలలో ఒకటి.ఇది మండల కేంద్రమైన రాజోల నుండి 6 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన అమలాపురం నుండి 30 కి. మీ. దూరంలోనూ ఉంది.
దేవాలయాలు.
ప్రధాన వ్యాసం: కపోతేశ్వర స్వామి దేవాలయం
ఈ గ్రామంలోఅతి పురాతనమైన ప్రఖ్యాతి గాంచిన కపోతేశ్వరస్వామి దేవాలయం ఉంది. దీనిని దక్షణ కాశీగా పిలుస్తారు. ఊరి మధ్యగా రామాలయం ఉంది. రామాలయపు వీధిలోనే వినాయక మందిరము ఉన్నాయి
పూర్వం కపోతేశ్వరస్వామి దేవాలయం ఉన్న ప్రదేశం ఒకప్పుడు అడవిగా ఉండేది. ఆ అడవిలో ఒక బోయవాడు వేటకు వెళ్లగా, ఆ రోజు విపరీతమైన వర్షం కారణంగా ఆహారం లభించకపోగా తడిసిన కారణంగా ఒక చెట్టుకింద కూర్చుని వణుకుతూ ఉంటాడు. బోయవాడు కూర్చున్న చెట్టుమీద గూడుకట్టుకుని ఒక పావురాలజంట నివసిస్తూ ఉంది. గూటిలో ఉన్న ఆడపావురం బోయవాడిని చూచి ఇతడు ఆహారం దొరకక క్షుదాతురుడై తమ గూటి క్రింద కూర్చున్నాడని, ఎవని ఇంటిదగ్గర ఆహారం లభించక ఉపవాసం ఉండునో, ఆ ఇంటి యజమానికి ఆ అతిథి తన పాపములను వదిలి వెళ్లుననే ధర్మశాస్త్ర విషయాలు తెలిసిదై ఆ పావురం పూర్వజన్మ జ్ఞానం కలదై శ్మశానంనకు పోయి మండుచున్న చితుకులను తెచ్చి బోయవాని ముందు పడవేసి,ఎండు పుల్లలు లభించని కారణంగా తన గూడును పడవేసి మంటచేసి బోయవాడి చలిబాధను తీరుస్తుంది.తరువాత ఆ పావురం అగ్నిలో పడి బోయవాడికి ఆహారంగా మారి అతడి క్షుద్బాధను తీరుస్తుంది. మేతకై పోయిన మగపావురం తిరిగి వచ్చి పరిస్థితిని గమనించి, తన భార్య చేసిన అతిథి సత్కారాలకు సంభ్రమాశ్చర్యాలను చెంది, వైరాగ్యంతో అది కూడా మంటలలో దూకి ప్రాణత్యాగం చేస్తుంది. అతిథి పూజకు తమ శరీరాలనే పణంగా పెట్టి ప్రాణత్యాగాలు చేసిన పావురాలజంట ధర్మనిరతికి పరమేశ్వరుడు ప్రత్యక్షమై ఆ జంటకు శివసాయుజ్యం అనుగ్రహిస్తాడు. పరమేశ్వరుని అనుగ్రహంతో బ్రతికిన అ పావురాలజంట "మహాప్రభో, మా త్యాగం చూచి మాతోపాటు ప్రాణాలు విడిచిన బోయవాడికి కూడా శివసాయుజ్యమును ప్రసాదించమని, శిల ఆకారంలో ఈ ప్రదేశంలో ఉండి శివుని పూజించిన భక్తులకు సద్గతులు ప్రసాదించమని ప్రార్థించగా ఈశ్వరుడు తథాస్తు అని అదృశ్యమౌతాడు. పిమ్మట అక్కడ ఈశ్వరుడు కపోతేశ్వరస్వామిగా వెలిసి, అప్పటి నుండి భక్తుల సేవలను అందుకుంటున్నాడని ..



FOR MORE CLICK THE LINK

https://www.youtube.com/live/IDnt_fNu2XY?si=8DgqZbBGxUQ-zucK

THANK YOU..






Comments

Popular posts from this blog

ABOUT Sri Kapoteswara Swamy Temple. KADALI (AP)