శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి కళ్యాణ షష్ఠి తీర్థం మహోత్సవములు-కడలి - శ్రీ కపోతేశ్వర స్వామి ఆలయం .Sri Kapoteswara Swamy Temple ,KADALI VILLAGE .(AP)
శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి కళ్యాణ షష్ఠి తీర్థం మహోత్సవములు - శ్రీ కపోతేశ్వర స్వామి ఆలయం కడలి, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా, రాజోలు మండలానికి చెందిన గ్రామం. రాజోలు నుండి లేదా జగ్గన్నపేట నుండి కేవలం మూడు కిలో మీటర్ల దూరం కలిగిన ఈ గ్రామం గోదావరి తీరప్రాంత గ్రామాలలో ఒకటి.ఇది మండల కేంద్రమైన రాజోల నుండి 6 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన అమలాపురం నుండి 30 కి. మీ. దూరంలోనూ ఉంది. దేవాలయాలు. ప్రధాన వ్యాసం: కపోతేశ్వర స్వామి దేవాలయం ఈ గ్రామంలోఅతి పురాతనమైన ప్రఖ్యాతి గాంచిన కపోతేశ్వరస్వామి దేవాలయం ఉంది. దీనిని దక్షణ కాశీగా పిలుస్తారు. ఊరి మధ్యగా రామాలయం ఉంది. రామాలయపు వీధిలోనే వినాయక మందిరము ఉన్నాయి పూర్వం కపోతేశ్వరస్వామి దేవాలయం ఉన్న ప్రదేశం ఒకప్పుడు అడవిగా ఉండేది. ఆ అడవిలో ఒక బోయవాడు వేటకు వెళ్లగా, ఆ రోజు విపరీతమైన వర్షం కారణంగా ఆహారం లభించకపోగా తడిసిన కారణంగా ఒక చెట్టుకింద కూర్చుని వణుకుతూ ఉంటాడు. బోయవాడు కూర్చున్న చెట్టుమీద గూడుకట్టుకుని ఒక పావురాలజంట నివసిస్తూ ఉంది. గూటిలో ఉన్న ఆడపావురం బోయవాడిని చూచి ఇతడు ఆహారం దొరకక క్షుదా...